NTV Telugu Site icon

ArshadWarsi : మరోసారి ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు..

Untitled Design (8)

Untitled Design (8)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్, బాక్సాఫీస్ స్టామినా ఏపాటిదో అందరికి తెలిసిందే. బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు కేవలం సౌత్ కు మాత్రమే పరిమితమైన రెబలోడి రేంజ్ పాన్ ఇండియా స్థాయి కి వెళ్ళింది. ఇక బాహుబలి 2 తోప్రపంచ స్థాయికు చేరుకుంది. రెబల్ స్టార్ సినిమా రిలీజ్ అయితే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి నంబర్స్ ఉంటాయి. సాహో, రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ కలెక్షన్స్ అందుకు నిదర్శనం.

తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన రెబల్ స్టార్ పై బాలీవుడ్ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ప్రభాస్ ఈ ఏడాది కల్కి అనే చిత్రంలో నటించాడు. ఆ చిత్రం వరల్డ్ వైడ్ గా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. కర్ణుడి పాత్రలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ చిత్రం గురించి అర్షద్ వర్షి మాట్లాడుతూ ‘ప్రభాస్ ఈ సినిమాలో జోకర్‌లా ఉన్నాడు ఒక మేల్ గిబ్స్‌ను ఆయన పాత్రలో చూడాలనుకున్నా. కానీ, మీరు ప్రభాస్‌ను అలా ఎలా చేశారు. ఇలాంటివన్ని మీరు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు’ అని అప్పట్లో అయన చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. దీంతో పలువురు టాలీవుడ్ నటులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ అర్షద్ పై తీవ్ర విమర్శలు చేసారు.

ఈ వివాదంపై అర్షద్ మరోసారి స్పందించారు, అర్షద్ మాట్లాడుతూ ” ప్రభాస్ అద్భుతమైన నటుడు, గతంలో ఆయన నటించిన సినిమాలు ఆ విషయాన్ని ప్రూఫ్ చేసాయి. నేను ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు కేలవం కల్కి సినిమాలో అయన పాత్ర గురించి మాత్రమే. అంతేగాని ప్రభాస్ గురించి కాదు”అని అన్నారు

Show comments