#ARRPD6 : క్రేజీ మూవీ షూటింగ్ షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ మైఖల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..యాక్టర్ గా, కొరియోగ్రఫర్ గా, దర్శకుడిగా టాలీవుడ్ ,కోలీవుడ్,బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మెప్పించాడు. అయితే సినీ ఇండస్ట్రీ లో కొన్నిక్రేజీ కాంబినేషన్స్ కు ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఉంటుంది.అలాంటి కాంబినేషన్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరియు ప్రభుదేవా కొరియోగ్రఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి.ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడైతే ఆ సాంగ్ వేరే లెవెల్ ఉంటుంది. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కి పిచ్చ క్రేజ్ వుంది . వీరి కాంబినేషన్ లో వచ్చిన ముక్కాలా..ముక్కాబుల సాంగ్ ఇప్పటికి ట్రెండింగ్ లో నిలిచింది.అయితే ఒక ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ ప్రభుదేవా అద్భుతమైన డాన్సర్ అని, రోమియో మరియు లవ్ బర్డ్స్ అనే సినిమాలకు తాను మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న టైంలో ప్రభుదేవా చేసే డ్యాన్సులు తనకు ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉండేవని చెప్పుకొచ్చారు.
అలాగే ప్రభుదేవా కూడా రెహమాన్ మ్యూజిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.రెహమాన్ సంగీతానికి డాన్స్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేయడం తనకి ఎప్పుడూ కూడా ఒక సవాలే అని ప్రభుదేవా తెలిపారు.ఇదిలా ఉంటే దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఒక సినిమాకి పనిచేయబోతున్నారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి మనోజ్ ఎన్ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు.#ARRPD6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు ప్రభుదేవా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసారు. ఈ చిత్రంలో యోగి బాబు, అజు వర్గీస్, అర్జున్ అశోక్, సాట్జ్, నిష్మా చెంగప్ప వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.డాన్స్ ,కామెడీ,మ్యూజిక్ ప్రధాన అంశాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాను దివ్య మనోజ్ ,ప్రవీణ్ ఎలక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు .
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
#ARRPD6 Shooting Begins@behindwoods @PDdancing #ManojNS @iYogiBabu @AjuVarghesee #ArjunAshokan #Satz @NishmaChengapp5 #SushmithaNayak pic.twitter.com/IxcOGQUWky
— Aju Varghese (@AjuVarghesee) May 2, 2024
- Tags
- #manoj ns
- AR Rehman
- Prabhudeva
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!