Site icon NTV Telugu

Arjun Son Of Vyjayanthi Trailer: అర్జున్ S/O వైజయంతి ట్రైలర్ అదిరింది చూశారా ?

Arjun Trailaer

Arjun Trailaer

కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమా ఏప్రిల్ 13వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఘనంగా నిర్వహించారు. అదే ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్, ముప్ప సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ముందు నుంచి ఈ సినిమా కంటెంట్ మీద ప్రేక్షకులలో ఒక రకమైన అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. అంచనాలను మరింత పెంచేలా ఈ సినిమా ట్రైలర్ కట్ ఉంది.

సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను పరిశీలిస్తే, విజయశాంతి ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా పనిచేస్తూ, ఆమె కుమారుడిగా అర్జున్ కనిపిస్తున్నాడు. ఇక వీరిద్దరి మధ్య ఒక మనస్పర్థ కారణంగా దూరం పెరుగుతుందని, విజయశాంతి చట్టం ప్రకారం శిక్షించాలని ప్రయత్నిస్తుంటే, అర్జున్ తనదైన చట్టం చేసుకుంటూ ఎవరినైతే పడితే వారిని శిక్షిస్తూ ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద ట్రైలర్ కట్ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలను పెంచేలా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రైలర్ మీద ఒక లుక్ వేసేయండి.

Exit mobile version