Ari Movie: ‘హనుమాన్’, ‘మిరాయ్’ బాటలో ‘అరి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ మీదకు దేవుడ్ని పట్టుకొచ్చి కోట్లకు కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ ఇలా అన్ని చిత్రాల్లో దైవత్వం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ, కథనాన్ని సెట్ చేసి.. దానికి డివైన్ ఎమోషన్స్‌ను జోడించేస్తున్నారు. క్లైమాక్స్‌తో సినిమాను అలా నిలబెట్టేస్తున్నారు. క్లైమాక్స్‌ని వేరే లెవెల్లో డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. క్లైమాక్స్ బలంగా ఉండబట్టే ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వండర్ క్రియేట్ చేశాయి.
ట్రైలర్‌లలో దేవుడి షాట్స్, భగవంతుడి ఆగమనానికి సంబంధించిన షాట్స్ పెట్టి అంచనాలు పెంచేస్తుండటం ఇప్పటి ట్రెండ్. ‘హనుమాన్’, ‘మిరాయ్’ ట్రైలర్లలో దేవుడు అడుగు పెట్టినట్టు చూపించారు. ఇక స్క్రీన్ మీద కూడా దైవాన్ని చూపించిన తీరుకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలా మెస్మరైజ్ చేయడంతో సినిమా రిజల్ట్ కూడా మారిపోయింది. ఇక ఇప్పుడు అరి అనే ఓ చిత్రం అక్టోబర్ 10న రాబోతోంది. రీసెంట్‌గా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఆరు పాత్రలు, వారి నేపథ్యం.. ఆ ఆరు క్యారెక్టర్లను కనెక్ట్ చేస్తే ఇంకో పాత్ర.. ట్రైలర్‌లో ఆ కృష్ణుడే నేల మీదకు దిగినట్టుగా పెట్టిన షాట్ చూసి అందరికీ గూస్ బంప్స్ వచ్చే ఉంటుంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
మరి ఆ అరిషడ్వర్గాల కాన్సెప్ట్ ఏంటి? ఈ సినిమాతో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతోన్నారు? పురాణేతిహాసాల్లో అరిషడ్వార్గాలు మీద చెప్పేది ఏంటి? వాటికి పరిష్కారం ఏంటి? అన్నది దర్శకుడు ఎలా చేయబోతున్నాడు? అనే ఆసక్తి అందరిలోనూ కలిగించారు. కృష్ణుడి మీద చేసిన ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్ అయితే ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా ఎంతో మంది గొప్ప ఆర్టిస్టులు నటించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!