Small Budjet Movies : చిన్న బడ్జెట్ సినిమాలకు రొమాన్స్, బోల్డ్, ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమా అంటే కొత్త కథ.. కొత్త ప్రయోగం.. కొత్త టాలెంట్‌కు అవకాశం అని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. లో బడ్జెట్ సినిమాలకు రొమాన్స్.. బోల్డ్ కంటెంట్.. ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారు. ఈ మధ్య వస్తున్న కొన్ని చిన్న సినిమాలను చూస్తుంటే.. హీరో, హీరోయిన్.. లవ్.. రొమాన్స్.. ఎమోషన్.. దీని చుట్టూ కథను నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది.
‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మళ్లీ కలిసి నటించిన సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. లండన్ బ్యాక్‌డ్రాప్.. కాలేజ్ వాతావరణం.. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ.. రొమాన్స్.. మధ్యలో ఎమోషనల్ టర్న్స్.. ట్రైలర్ చూస్తే మరోసారి యువత ప్రేమనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.సినిమా పేరు ‘ఎపిక్’ అయినా.. కథ మాత్రం మరో రెగ్యులర్ యూత్ లవ్ రొమాంటిక్ స్టోరీగా మారిపోతుందా అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
ఇప్పటికే ‘హుషారు పిట్టలు’ కూడా యూత్ రొమాన్స్‌నే నమ్ముకుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ యూత్‌లో ఆకర్షణ, సీక్రెట్ రిలేషన్, బోల్డ్ రొమాన్స్, యూత్ కంటెంట్‌నే మార్కెటింగ్ ఆయుధంగా మార్చుకున్నట్టుగా కనిపించింది. థియేటర్స్ లో కొంత వసూళ్లు రాబట్టింది. ఇక ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రం రొమాన్స్‌ను తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో ముడిపెట్టింది. సాధారణ యువకుడు రాజు.. అమాయకమైన రాంబాయి.. ఇద్దరి మధ్య ప్రేమ.. ఆ ప్రేమ గెలవాలంటే, ప్రెగ్నెన్సీ ఐడియాతో రొమాన్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాకపోతే, రియలిస్టిక్ టచ్‌తో కథను చెప్పే ప్రయత్నం చేయడంతో సక్సెస్ సాధించారు.
అయితే ఈ మూడు సినిమాలను కలిపి చూస్తే ఒక పాయింట్ మాత్రం కనిపిస్తోంది. చిన్న సినిమా అంటే ప్రేమకథ.. ప్రేమకథ అంటే యూత్ టార్గెట్.. ఇదే ఇప్పుడు సేఫ్ ఫార్ములాగా మారిపోతోందా? ‘ఎపిక్’లో కాలేజ్ లవ్ అండ్ రొమాన్స్, ‘హుషారు పిట్టలు’లో యూత్ రొమాన్స్.. ‘రాజు వెడ్స్ రాంబాయి’లో పల్లెటూరి ప్రేమ.. మరి చిన్న సినిమాలు కూడా రొమాన్స్‌ను దాటి కొత్త జానర్స్‌లో రిస్క్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసిందనే అనుకోవాలి.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!