NTV Telugu Site icon

AP/TG Floods : తెలుగు ప్రజలకు తమిళ నటుడి సాయం.. రూపాయి విదల్చని టాలీవుడ్ రాజా – రాణి..

Untitled Design (4)

Untitled Design (4)

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదలు సంభవించి ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో తాము ప్రజకు అండగా ఉంటాం అని ముందడుగు వేసింది చిత్రపరిశ్రమ. వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ తమ వంతుగా ఆర్థిక సాయం చేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు.

Also Read : 35Movie : ’35 చిన్న కథ కాదు’ సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది : నివేతా థామస్..
ఇదిలా ఉండగా తెలుగు ప్రజల ఇబ్బందులు చూసి ఆదుకునేందుకు భాద్యతగా ముందుకు వచ్చాడు తమిళ నటుడు సిలంబరసన్ శింబు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 6 లక్షలు అందించారు. వరద బాధిత తెలుగు రాష్ట్రాలకు సహాయాన్ని అందించిన మొదటి తమిళ నటుడు శింబు. ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేయని శింబు తెలుగు ప్రజలకు చేసిన సాయానికి ‘ఎంత చేసారు అన్నది కాదు.. ఇవ్వాలి అన్న సంకల్పం ముఖ్యం’ అని శింబు పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఒక్కో సినిమాకు రూ. 25 కోట్లు తీసుకునే రాజాలు, నేను మీ పక్కింటి అబ్బాయ్ ని అని చెప్పే సహజ నటులు, ఫ్యామిలీ ఫెమస్ స్టార్ లు, రారా సామి అనే పాడే క్రష్ లు,స్పెషల్ సాంగ్ కు కోట్లు తీసుకునే మావలు ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం పట్ల నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.