Site icon NTV Telugu

చిక్కుల్లో యాంకర్ ప్రదీప్..!

Telugu TV host Pradeep Machiraju tests positive for COVID-19

యాంకర్‌ ప్రదీప్‌ పేరు తెలియని వారుండరు. టీవీ ఛానెళ్లలో అదిరిపోయే యాంకరింగ్‌తో ప్రేక్షకుల మనస్సుల్లో గుర్తిండిపోయేలా చోటు సంపాదించుకున్నాడు. యాంకరింగ్‌ ఎలాంటి మచ్చలేని ప్రదీప్‌.. గతంలో డ్రంకన్‌ డ్రైవ్‌ లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే… తాజాగా యాంకర్‌ ప్రదీప్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రదీప్‌ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వివాదంపై రంగంలోకి దిగిన ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికలపూడి శ్రీనివాసరావు… ప్రదీప్‌ ను తీవ్రంగా హెచ్చరించారు. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్‌ ప్రదీప్‌ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే.. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రదీప్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని.. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ప్రదీప్‌ ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version