టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి అలరించారు.
Also Read : HHVM : హరి హర వీరమల్లు ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ రిలీజ్
ఇక డే – 1 నుండి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ దూసుకెళ్లింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 45 కోట్లు రాబట్టి వెంకీ కెరీర్ లోనే హయ్యెస్ట్ నంబర్స్ రాబట్టింది. ఇక రెండవ రోజు కూడా అన్ని ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ తో రూ. 77 కోట్లు కొల్లగొట్టింది. ఇక లేటెస్ట్ గా మూడు రోజుల కలెక్షన్స్ ను అధికారకంగా ప్రకటించింది నిర్మణా సంస్థ. మూడు రోజులకు గాను రూ. 106 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో తోలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు విక్టరీ వెంకటేష్. అటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 1.5 మిలియన్ రాబట్టి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది. లాంగ్ రన్ లో సంక్రాంతికి వస్తున్నాం ఎంత వసూళ్లు రాబడతాడో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి. రెగ్యులర్ డేస్ లో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టడం ఇక్కడ కొసమెరుపు.