NTV Telugu Site icon

ఫరెవర్ డిజైరబుల్ విమెన్ గా దేవసేన

Anushka Shetty is the latest to join the elite list of Hyderabad Times 'Forever Desirable'

టైమ్స్ ఆఫ్ ఇండియా వారు 2020 ఏడాదికి గానూ మోస్ట్ డిజైరబుల్ సెలెబ్రిటీల లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఫరెవర్ డిజైరబుల్ విమెన్ గా మన దేవసేన… అంటే అనుష్కకు గౌరవం దక్కింది. ఫరెవర్ డిజైరబుల్ విమెన్ 2020గా నిలిచి అనుష్క రికార్డు క్రియేట్ చేసింది. ‘బాహుబలి’తో సౌత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేవసేనగా గుర్తింపు పొందిన అనుష్కకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు ప్రభాస్ కూడా “ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్-2020″గా నిలవడం విశేషం. సాధారణంగానే అనుష్క-ప్రభాస్ జంట సౌత్ లో ఎవర్ గ్రీన్. అలాంటిది వీరిద్దరూ “ఫరెవర్ డిజైరబుల్”గా నిలవడం అనేది వారి అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. కాగా శృతి హాసన్ 2020లో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎంపికైంది. ఈ జాబితాలో సమంతా 2వ స్థానంలో, పూజా హెగ్డే 3వ స్థానంలో, రకుల్ ప్రీత్ 4వ స్థానంలో, రష్మిక మండన్న 5వ స్థానంలో నిలిచారు. ఇక హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 జాబితాలో టాప్ పొజీషన్ 2019లాగే 2020లోనూ విజయ్ దేవరకొండ వశమైంది! రెండవ స్థానాన్ని రామ్ పోతినేని సొంతం చేసుకున్నారు. 2019లో 3వ స్థానంలో నిలిచిన రామ్ ఈసారి ఒక సంఖ్యపైకి ఎగబాకి రెండవ స్థానంలో నిలిచాడు. రామ్ నటించిన ఒక్క సినిమా కూడా 2020లో విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలవడం విశేషం. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో రామ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (3), రామ్ చరణ్ (4), నాగ శౌర్య (5), నాగ చైతన్య (6) స్థానాల్లో ఉన్నారు.