Site icon NTV Telugu

Anushka : ‘ ఘాటి’ ప్రాజెక్ట్ నుండి కూడా క్రిష్ త‌ప్పుకున్నాడా.. ?

Kriskh Ghati

Kriskh Ghati

టాలీవుడ్ ద‌ర్శకుడు క్రిష్ జాగర్లమూడి  టాలెంట్ గురించి మనకు తెలిసిందే. ఆయ‌న తెర‌కెక్కించిన ఏ మూవీ అయిన ప్రేక్షకుల మ‌దిలో అలా నిలిచిపోతాయి. ఏ ద‌ర్శకుడు ట‌చ్ చేయ‌ని కాన్సెప్టుల‌తో క్రిష్ ప‌లు సినిమాలు తెర‌కెక్కించాడు. కానీ ప్రజంట్ క్రిష్ టైమింగ్ బాలేదు. ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ చిత్రం తెర‌కెక్కించ‌గా,ఈ మూవీతో క్రిష్ జాత‌కం మారిపోవ‌డం ఖాయం అని అనుకున్నారు. 9 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేద్దామని స్పీడ్ మీద ఉన్న క్రిష్‌.. ఫస్ట్ హాఫ్ ని చాలా తొందరగా పూర్తి చేశారు. కానీ మధ్యలో కరోనా, లాక్ డౌన్ అంటూ గ్యాప్ వచ్చింది. ఇక అంత క్లియర్ అయిన టైంలో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు..

Also Read : Suhas : తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సుహాస్..

ఇక ఈ మూవీ నుండి త‌ప్పుకున్న త‌ర్వాత అనుష్కతో ‘ఘాటి’ మొద‌లు పెట్టాడు. గ‌త ఏడాది టీజ‌ర్ కూడా విడుద‌ల చేసి మూవీపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా మూవీపై ఆస‌క్తి క‌లిగేలా చేసింది. అయితే ఈ చిత్రాని ఏప్రిల్ 18న రిలీజ్ చేయ‌బోతున్నట్టు మేక‌ర్స్ గ‌తంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఈ సినిమా పరిస్థితి అయోమయంగా మారింది.

ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై క్లారిటీ కూడా లేకుండా పోయింది. అంతే కాదు ప్రేక్షకుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఏంటంటే ఈ మూవీ కూడా మధ్యలో ఆగిపోయిందా?, లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అస‌లు క్రిష్ సినిమాల‌కే ఎందుకు ఇలాంటి స‌మ‌స్యలు త‌లెత్తుతున్నాయి. ఇంతకు ముందు కూడా బాలీవుడ్ లో ఆయన ‘మణికర్ణిక’ వంటి చారిత్రాత్మక చిత్రాన్ని మొదలు పెట్టి, మధ్యలో వెళ్ళిపోయాడు. మిగిలిన సినిమా కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ని మ‌ధ్యలోనే వదిలిపెట్టేశారు. ఇక ఇప్పుడు ఘాటీని కూడా మ‌ధ్యలోనే వ‌దిలేశారా అన్న ప్రశ్న త‌లెత్తుతుంది

Exit mobile version