అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ కనుక చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ వేదికపై మరో అడుగు వేసింది.
Also Read :Kingdom : ‘కింగ్డమ్’ నుండి హార్ట్‌టచింగ్ సాంగ్..
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంటెంట్ పట్ల ఉన్న నమ్మకంతోనే ప్రైమ్ వారు ముందుగా ఈ డీల్ క్లోజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అనుపమకు తోడు దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలో కనిపించనున్నారు. అనుపమ తో కలిసి వారి పాత్రలు కూడా కథలో కీలక మలుపులు తిప్పబోతున్నాయని సమాచారం. అనుపమ ఈ సినిమాతో నటిగా మరింత ఎదుగుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంపై అభిమానుల్లో కాక, సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సంగీత దర్శకుడు గోపి సుందర్ అందిస్తున్న బాణీలు ఈ కథకు మరింత బలాన్నివ్వనుంది.
