NTV Telugu Site icon

ANR 100 : అభిమానులతో కలిసి ANR ‘ప్రేమ్ నగర్’ మూవీ చూసిన నాగచైతన్య

Untitled Design (42)

Untitled Design (42)

ఈ ఏడాది సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు100వ జయంతిని పురస్కరించుకుని, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఈ ఫెస్టివల్‌లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా వంటి స్మాల్ సిటీస్ సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 – 22, 2024 నుండి 10 రిస్టోర్డ్ ANR క్లాసిక్స్ ప్రదర్శించనున్నారు.

Also Read : NTR : జూనియర్ ఎన్టీయార్ లైనప్ మాములుగా లేదుగా..

నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. హైదరబాద్ లో ‘దేవదాసు’ 4K స్క్రీనింగ్ తో ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైయింది. 31 సిటీస్ లో ANR గారి 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శస్తున్నారు. ఈ ఫెస్టివల్ లో భాగంగా అక్కినేని నాగచైతన్య తన తాతగారి క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ (1971) చిత్రాన్ని శాంతి థియేటర్ లో అభిమానులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా అభిమానులు కోలాహలంతో థియేటర్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘దేవదాసు’ (1953), ‘మిస్సమ్మ’ (1955) ‘మాయాబజార్’ (1957), ‘భార్య భర్తలు’ (1961), ‘గుండమ్మ కథ’ (1962), ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘సుడిగుండాలు’ (1968), ‘ప్రేమ్ నగర్’ (1971), ‘ప్రేమాభిషేకం’ (1981) ‘మనం’ (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసారు.