NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నుంచి రాబోతున్న మరో పవర్ ప్యాక్డ్ ట్రైలర్..?

Kalki (1)

Kalki (1)

Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినిదత్ ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వుంది.రీసెంట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ ట్రైలర్ సినిమాపై భారిగా అంచనాలు పెంచేసింది.తాజాగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబై లో గ్రాండ్ గా నిర్వహించారు.

Read Also :Prashanth Neel : ఎన్టీఆర్, ప్రభాస్.. ప్రశాంత్ నీల్ మూవీ ఎవరితో..?కన్ఫ్యూషన్ లో ఫ్యాన్స్..

ఈ ఈవెంట్ కు అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ,ప్రభాస్ ,దీపికా పదుకోన్ ,అశ్వినిదత్ ,నాగ్ అశ్విన్ వంటి తదితరులు హాజరయ్యారు.అలాగే దగ్గుబాటి రానా ఈ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించారు.ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వారు రానాతో షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్యింగ్ వైరల్ అవుతుంది.ఈ సినిమా రిలీజ్ కు ముందు మరో పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ ట్రైలర్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.ఈ ట్రైలర్ తో ప్రభాస్ కల్కి సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.దీనితో కల్కి సెకండ్ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.