అక్షయ్ కుమార్ నటించిన స్పై థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’ మూవీ నిజానికి ఈ యేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా జూలై 27కు వాయిదా పడింది. కానీ అప్పటికీ దేశ వ్యాప్తంగానూ, విదేశాలలోనూ థియేటర్లు పెద్దంతగా తెరుచుకోలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడు తమ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
Read Also : టీఆర్పీ పెంచేలా… ఆర్పీ పట్నాయక్… బుల్లితెర గెస్ట్ అప్పియరెన్స్!
వాణీ కపూర్, లారా దత్తా, హుమా ఖురేషీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను రంజిత్ ఎం తివారి దర్శకత్వంలో వషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్ శిఖా దేశ్‌ముఖ్, మోనిషా అద్వానీ, మధు భోజ్వాని, నిఖిల్ అద్వానీ సంయుక్తంగా నిర్మించారు. ఎనభైల నాటి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పూజా ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆ కాలానికి తీసుకెళుందనే అంతా భావిస్తున్నారు.
