Site icon NTV Telugu

Anna Konidela: సింగపూర్ లో రెండో మాస్టర్స్.. పట్టా పొందిన పవన్ భార్య

Anna Konidela Masters

Anna Konidela Masters

Anna Konidela gets Second Masters Degree at Singapore: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. శ్రీమతి అనాకి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు తన సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

Samantha: ఫ్యామిలీ మాన్ కాంబో రిపీట్ చేస్తున్న సమంత..

అనా కొణిదెల ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికి గాను తొలుత డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో అనా మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

Exit mobile version