Site icon NTV Telugu

సుశాంత్ మొదటి వర్ధంతి… అంకితా లోఖండే పూజ

Ankitha Lokhande, Ankitha Lokhande Pooja, Sushanth Singh Rajputh, Sushanth Singh Rajputh Death Anniversary, Sushanth

జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 1వ వర్ధంతి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన ముంబై అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. 34 ఏళ్ల ఈ నటుడు చనిపోయే ముందు రియా చక్రవర్తితో డేటింగ్ చేశాడు. అంకితా లోఖండే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ స్నేహితురాలు. వారు 2016 తరువాత విడిపోయారు. ఆయన ఆత్మహత్య బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారిస్తోంది. ఇక ఈరోజు సుశాంత్ వర్ధంతి సందర్భంగా సుశాంత్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి అంకితా లోఖండే తన ఇంట్లో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో వెల్లడించింది. రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్షికోత్సవం సందర్భంగా సుశాంత్ ను తలచుకుంటూ పోస్ట్ చేసింది.

Exit mobile version