బాలీవుడ్ నటి అంకిత లోఖండే ఈసారి ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. పాపులర్ షో “బిగ్ బాస్ సీజన్ 15” త్వరలోనే హిందీలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు వీళ్ళేనంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ జాబితాలో అంకిత పేరు కూడా విన్పించింది. తాజాగా ఆమె ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. “ఈ సంవత్సరం నేను బిగ్ బాస్ లో పాల్గొంటానని మీడియాలోని కొన్ని విభాగాల నుంచి ఊహాగానాలు వస్తున్నాయని నా దృష్టికి వచ్చింది. కానీ నేను బిగ్ బాస్ లోకి వెళ్ళడం లేదు. అందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాపై వస్తున్న ఈ పుకార్లు నిరాధారమైనవి” అని పోస్ట్ చేసి తనపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.
Read Also : బికినీలో బాలీవుడ్ బార్బీ హాట్ ట్రీట్
ఇక అంకిత సౌత్ కు అంతగా తెలియదు కానీ బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం. పలు సీరియల్స్ లో నటించిన అంకిత 2019లో ‘మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే అన్నిటికన్నా ఎక్కువగా సుశాంత్ ఆత్మహత్య వార్తల్లో నిలిచి అందరి దృష్టిలో పడింది. ఇక అంకిత గత మూడు సంవత్సరాలుగా విక్కీ జైన్‌తో రిలేషన్ లో ఉంది. వారిద్దరికీ సంబంధించి ఆమె షేర్ చేసే పిక్స్ ఇంటర్నెట్ వైరల్ అవుతుంటాయి. కాగా ‘బిగ్ బాస్’లో అంకితా లోఖండేతో పాటు రియా చక్రవర్తి కూడా పాల్గొననుంది అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడైతే అంకిత పుకార్లపై స్పందించి ఆ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. మరి రియా ఈ రియాలిటీ షోలో పాల్గొంటుందా లేదా ? అనే విషయం తెలియాల్సి ఉంది.
