NTV Telugu Site icon

‘ఎఫ్-3’లో వకీల్ సాబ్ బ్యూటీ …!

Anjali roped in for Anil Ravipudi’s F3

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు పోస్టర్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’లో ఉన్న ప్రధాన తారాగణం వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ సీక్వెల్ లో కూడా కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘ఎఫ్3’లోని ఓ కీలకపాత్ర కోసం అంజలిని తీసుకుంటున్నారట. టాలెంటెడ్ బ్యూటీ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ హిట్ ను ఎంజాయ్ చేస్తోంది. ‘వకీల్ సాబ్’లో అంజలి కూడా నటించిన విషయం తెలిసిందే. ‘ఎఫ్3’లో తెలుగమ్మాయి అంజలిని తీసుకోబోతున్నట్లు త్వరలోనే చిత్రబృందం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా ఈసారి వెంకీ, తమన్నా, వరుణ్, మెహ్రీన్ పాత్రలు డబ్బు సంపాదనపై విపరీతంగా దృష్టి పెట్టటంతో ఇబ్బందులు వస్తాయట. ఈ చిత్రం 2021 ఆగష్టు 21న విడుదల కానుంది.