హీరోయిన్ అంజలి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు అమ్మయి అయినప్పటికి తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో మాత్రం ఎప్పుడూ ఛాన్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. వెంకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు జతకట్టిన.. అవకాశాలు మాత్రం నిల్. ప్రజెంట్ ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. గీతాంజలి మళ్లీ వచ్చింది, గేమ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్ లాంటి వరుస ప్లాపులు ఆమెకు ఛాన్సులు లేకుండా చేస్తున్నాయి. గ్లామర్ షో చేస్తూ టాలెంట్ ఉన్నప్పటికి.. టాలీవుడ్ దర్శకులు ఆమెను కన్సిడర్ చేయడం లేదు. కానీ..
Also Read: Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ టీజర్‌కు డేట్ ఫిక్స్ ..
తెలుగు ఇండస్ట్రీ కాదంటున్నా.. తమిళ చిత్ర పరిశ్రమ అంజలికి ఎప్పుడూ ఛాన్సులు ఇస్తూనే ఉంది. రీసెంట్‌గా ‘మదగజరాజా’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ తెలుగమ్మాయి.. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది. ‘ఈగై’ తో పాటు ‘పరందు పో’ అనే మూవీ చేస్తోంది. పరాయి ఇండస్ట్రీ హీరోయిన్స్ ని కోట్లు పెట్టి తీసుకుంటారు.. కానీ తెలుగు టాలెంటెడ్ యాక్టర్స్ ను మాత్రం గుర్తించరు అనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. ఇక అంజలి విషయంలో ఇదే జరుగుతుంది.
