Site icon NTV Telugu

Anirudh: అనిరుథ్‌కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ?

Anirudh

Anirudh

ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో మంచి సినిమాలతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు అనిరుధ్. రజనీకాంత్ బంధువుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్టార్లు, సూపర్ స్టార్లు కూడా మాకు అనిరుధ్ కావాలని పట్టుబట్టే పరిస్థితి వచ్చింది. పాటలు చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెస్మరైజ్ చేసేలా ఉంది. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్‌లో అయితే అనిరుధ్ మ్యూజిక్ ఒక రేంజ్‌లో వర్క్ అవుతుంది.

Also Read:Pawan Kalyan : సినిమాలు ఆలస్యం.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం?

ప్రస్తుతానికి అత్యధిక పారితోషికం అందుకుంటున్న సంగీత దర్శకుడిగా అనిరుధ్ నిలుస్తున్నాడు. 15 కోట్లు తీసుకోగా, ఆ సినిమా ఆడియో రైట్స్ 18 కోట్లకు అమ్ముడుపోయాయి. అంటే, అనిరుధ్‌కు ఇచ్చిన డబ్బును అక్కడే సంపాదించేసింది సినిమా టీం. అయినా సరే, ఒక సంగీత దర్శకుడికి ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు.

ALso Read:Anchor Shyamala: ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం!

ఎందుకంటే, ఎప్పుడో సినీ రంగంలో ప్రవేశించి, ఇప్పటికీ సంగీతం అందిస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఇంకా 10 కోట్ల రేంజ్‌లోనే ఉన్నాడు. అతను ఒక్కో సినిమాకు 7 నుంచి 8 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. అయినా సరే, వీరి కంటే ఆలస్యంగా రంగంలోకి దిగిన అనిరుధ్ ఏకంగా 15 కోట్లు తీసుకుంటూ, ఇండియాలోనే టాప్ రెమ్యూనరేషన్ అందుకునే మ్యూజిక్ డైరెక్టర్‌గా అవతరించడం గమనార్హం.

Exit mobile version