Anirudh: సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టిన అనిరుధ్.. ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో మ్యాజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anirudh: సినీ పరిశ్రమలో తన మ్యూజిక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కెరీర్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు వెండితెరపై తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను షేక్ చేసిన ఈ మ్యూజిక్ మెజీషియన్, ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తన సొంత మ్యూజిక్ లేబుల్ ‘అల్బుకర్కీ రికార్డ్స్’ అండ్ ‘యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా’ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందిన ‘అరవింద్’ అనే స్పెషల్ ప్రైవేట్ సాంగ్‌ను అనిరుధ్ తాజాగా విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో పక్కా పాప్, హిప్ హాప్ స్టైల్లో వచ్చిన ఈ ట్రాక్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.
2012లో ‘వై దిస్ కొలవెరి డి’ అనే ఒకే ఒక్క పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనిరుధ్, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. సౌత్‌లో జైలర్, కూలీ, విక్రమ్, లియో, దేవర పార్ట్-1 వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ అందించారు. కేవలం సౌత్‌లోనే కాకుండా, బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాతో హిందీ మార్కెట్‌ను సైతం తన ఖాతాలో వేసుకున్నారు. ఎన్నో ఏళ్ల కష్టం, మరెన్నో విలక్షణమైన ట్యూన్స్‌తో ఇండస్ట్రీలో ‘రాక్‌స్టార్’ అనే బ్రాండ్‌ను సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా ఒక పాటను రిలీజ్ చేయడం చాలా సులభం కావచ్చు, కానీ గాడ్‌ఫాదర్ లేని ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు. ఈ నేపథ్యంలో, ఒక సామాన్య సంగీతకారుడు తన ప్రతిభను నిరూపించుకోవడానికి పడే తపన, ఎదుర్కొనే సవాళ్లను బేస్ చేసుకుని ఈ ‘అరవింద్’ సాంగ్‌ను డిజైన్ చేశారు. ఈ పాటలో కనిపించే ‘అరవింద్’ పాత్ర మరెవరో కాదు.. అనిరుధ్ తనను తాను ప్రతిబింబించుకున్న క్యారెక్టర్. అహంకారం, అవమానాలు, అడ్డంకులు ఎదురైనా సరే.. సంగీతంపై ఉన్న పిచ్చితో, ప్యాషన్‌తో జీవితాన్ని మ్యూజిక్కే అంకితం చేసిన ఒక యువకుడి కథే ఈ పాట. ఏదో ఒక రోజు తన టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుందనే నమ్మకంతో ఆ యువకుడు సాగించే పోరాటమే ‘అరవింద్’.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
తాజావార్తలు
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!