Anirudh Kavya Marriage: తాళి కూడా కట్టలేదు కానీ పెళ్లి ఖర్చు రూ.100 కోట్లు!

Anirudh Kavya Maran

Anirudh Kavya Maran

సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 11న గ్రీస్ దేశంలోని అత్యంత విలాసవంతమైన ‘ఫోర్ సీజన్స్ అస్టిర్ ప్యాలెస్’ హోటల్‌లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. చూడటానికి చాలా సింపుల్‌గా అనిపించిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు జాతీయ మీడియా వర్గాల సమాచారం. చెన్నై నుంచి ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్య అతిథులను గ్రీస్ తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేశారు. అతిథుల వసతి, విలాసవంతమైన వేదిక ఖర్చులన్నీ కలిపి వంద కోట్ల మార్కును దాటాయని తెలుస్తోంది.

దీనికి తోడు, నవంబర్ 21న చెన్నైలోని ఒక స్టార్ హోటల్‌లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్ ఖర్చులను కూడా కలుపుకుంటే మొత్తం పెళ్లి బడ్జెట్ రూ. 150 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, ఈ ఖర్చుల వివరాలపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కళానిధి మారన్ ఆస్తుల విలువ సుమారు రూ. 24,600 కోట్లు కావడంతో, తన ఒక్కగానొక్క కుమార్తె పెళ్లికి ఈ స్థాయిలో ఖర్చు చేయడం పెద్ద విషయమేమీ కాదన్న చర్చ నడుస్తోంది.

సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అనిరుధ్, వేద మంత్రాల సాక్షిగా, వైదిక పద్ధతిలో పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ వివాహం’ (Self-Respect Marriage) పద్ధతిలో ఈ వేడుక జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ అందించిన చైన్‌ను అనిరుధ్ కావ్య మెడలో వేయగా, సీఎం స్టాలిన్ ఇచ్చిన చైన్‌ను కావ్య అనిరుధ్‌కు అలంకరించారు. ఎలాంటి తాళి కట్టే తంతు లేకుండా కేవలం దండలు, చైన్లు మార్చుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.