NTV Telugu Site icon

Anirudh: నాని ‘ప్యారడైజ్’ కోసం అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్”?

Anirudh

Anirudh

యంగ్ తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో మనోడు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ ఇటీవల రిలీజ్ అయిన దేవర సినిమాలకు అనిరుద్ అందించగా ఆ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ బాగా అసెట్ అయింది. ఇప్పుడు మనోడు మరో సినిమా సైన్ చేశాడు. ఈ మేరకు తాజాగా ఆ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. నాని హీరోగా శ్రీకాంత్ వదల డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘ది పారడైజ్’ ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నట్లు తాజాగా సినిమా యూనిట్ ప్రకటించింది.

February Release Dates: ఫిబ్రవరి రిలీజ్ డేట్లలో మార్పులు.. ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలంటే?

నానితో కలిసి అనిరుద్ చేసే మూడవ సినిమా ఇది. ఎందుకంటే నానితో జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ సినిమాకి మరోసారి పనిచేస్తున్నాడు అనిరుద్. అంతేకాక ఈ సినిమా కోసం భారీ ఎత్తున రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి శ్రీకాంత్ ఓదెల గత రెండు మూడేళ్ల నుంచి స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి నాని తన హిట్ 3 సినిమా షూటింగ్ ముగించే పనిలో ఉన్నాడు. ఆ తరువాత ఈ సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది.