NTV Telugu Site icon

Anirudh: పాపం అనిరుధ్.. ఏం చేసినా ట్రోలింగే?

anirudh

Anirudh getting Trolled again and again : ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో అనిరుధ్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమాలు మరో లెవల్‌కి వెళ్తున్నాయి. సూపర్ స్టార్ రజనీ కాంత్‌ సక్సెస్ ట్రాక్ ఎక్కిన జైలర్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. స్వయంగా రజనీనే ఈ సినిమా ఆడుతుందా? అనే సందేహపడ్డారు. కానీ అనిరుధ్ మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిందని అన్నారు. జైలర్ సినిమాను అనిరుధ్ మ్యూజిక్ లేకుండా చూడలేం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టిన అనిరుధ్.. హుకుం, కావాలయ్య సాంగ్స్‌తో ఉర్రుతులూగించాడు. ఇప్పుడు జైలర్ తర్వాత సూపర్ స్టార్ చేస్తున్న వేట్టయాన్ సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. జై భీమ్ వంటి సినిమాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను అధికారకంగా ప్రకటించారు మేకర్స్.

Aditi Shankar: బెల్లం బాబు కోసం స్టార్ డైరెక్టర్ కూతురు?

వినాయక చవితిని సందర్భంగా.. ఈ చిత్రంలోనీ ‘మనసిలాయో’ అంటూ సాగే మొదటి పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ బయటికి రాగానే.. అనిరుధ్ వర్సెస్ అనిరుధ్‌గా మారుతుందనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రజెంట్ అనిరుధ్ నుంచి వస్తున్న సినిమాల్లో దేవర పై భారీ హైప్ ఉంది. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ అవగా.. మొదట్లో ట్రోల్ అయి మెల్లిగా చార్ట్ బస్టర్స్‌ అయ్యాయి. దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌ పై కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. వేట్టయాన్ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా ఈ పాటతో దేవర పాటలతో కంపారిజన్ ఉంటుంది. దేవర కంటే బాగుంటే టైగర్ ఫ్యాన్స్, లేకుంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ ట్రోల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి.. వేట్టయాన్ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి.

Show comments