NTV Telugu Site icon

Anasuya sister: యాంకర్‌ గా అనసూయ చెల్లి.. మరి అక్క పరిస్థితి!

Anasuya Sister Vishnavi

Anasuya Sister Vishnavi

Anasuya sister: హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ యాంకర్‌గా, ఆర్టిస్ట్‌గా చాలా మంచి పేరు తెచ్చుకుంది ఆమె. అటు యాంకర్‌గా, ఇటు నటిగా అనసూయ ఎలా దూసుకెళ్తోందో అందరికీ తెలుసు! జబర్దస్త్ షో పుణ్యమా అని బుల్లితెరపై మెరిసింది. అందాలతో మైమరిపించడంతో కుర్రకారులో ఎనలేని ఫాలోయింగ్ వచ్చింది. దాంతో ఐటమ్ సాంగ్ ఆఫర్స్ వచ్చిన ఈ భామ ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా తనదైన ముద్ర వేసింది. అంతే, ఆ పాత్ర చేసినప్పటి నుంచి అనసూయకు తిరుగులేకుండా పోయింది. వరుసగా క్రేజీ ఆఫర్లు రావడం మొదలైంది. తనకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

Read also: Deepavali : 24నే దీపావళి జరుపుకోవాలి.. ఎందుకంటే?

ఇప్పుడు అనసూయ సోదరి కూడా బిగ్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జీ తెలుగులో ప్రారంభం కానున్న ఓ షోకి ఆమె యాంకర్‌గా వ్యవహరించనుందని టాక్‌. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. యాంకర్‌ కం నటి అనసూయకు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. వీరిలో వైష్ణవి సేమ్‌ టు సేమ్‌ అక్క అనసూయను పోలివుంటుంది. ఇక అక్కను పోలిన వైష్ణవి యాంకర్‌ గా ఎంట్రీ ఇస్తే తెరపై రచ్చే రచ్చ. అక్కను మించి దూసుపోతుందని టాక్‌. వైష్ణవి యాంకర్‌ గా ఎంట్రీ ఇస్తే ఒక తెరపై ఆధిపత్యం చెలాయించడం ఖాయం. అడపాదడపా తన సోదరితో కలిసి తెరపై కనిపించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది వైష్ణవి.

Read also: Forex : ఆర్థిక నిల్వలకు ఇబ్బందిలేదు.. సమృద్ధిగా ఉన్నాయి

యాంకర్ గా అనసూయ లక్షలకు లక్షలు సంపాదిస్తూనే ఇండస్ట్రీలో యాంకర్ గా పేరు తెచ్చుకుని విపరీతమైన అభిమానులను ఏర్పరుచుకుంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఆమె చెల్లి వైష్ణవి యాంకర్‌ కావాలని నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఓ బిగ్గేస్ట్‌ షోతో ఎంట్రీ ఇస్తోందట వైష్ణవి. ఇక వైష్ణవి ఎంట్రోతో అక్క అనసూయకు దేత్తడే అంటున్నారు. అసూయ చెల్లి వైష్ణవి ఇప్పటికే ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్నారు. మరి యాంకర్‌ గా ఎంట్రీతో అనసూయ అభిమానులను కూడా తమ వైపు తిప్పుకుంటుందనే టాక్‌ వస్తోంది. అనసూయ చెల్లెలు వైష్ణవిని తెరపై చూడాలంటే ఇక కొద్దిరోజులే ఆగాల్సిందే..
Astrology: అక్టోబర్ 20, గురువారం దినఫలాలు