Site icon NTV Telugu

Anasuya : గోల్డ్ శారీలో మెరిసిన అనసూయ..

Anasuya

Anasuya

బుల్లితెర యాంకర్ అనసూయ రోజు రోజుకు అందాలతో రచ్చ చేస్తుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. తాజాగా ఆమె ఓనమ్ సెలబ్రేషన్స్ కోసం కట్టిన శారీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. నిలువెత్తు బంగారంలా
గోల్డ్ శారీలో మెరిసింది..

బుల్లితెర మీద స్టార్ గా వెలుగు వెలిగిన అనసూయ.. ఇక టెలివిజన్ కు గుడ్ బై చెప్పి.. ఇప్పుడు పూర్తిగా వెండితెరకే పరిమితం అయ్యింది. మంచి పాత్రలు దక్కించుకుంటూ.. వరుస సినిమాల్లో నటిస్తుంది.. ఒక్కో సినిమాతో క్రేజ్ ను దక్కించుకుంటుంది.. ముఖ్యంగా ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర, పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రకు ఫిదా అయ్యారు ఆడియిన్స్.. టెలివిజన్ లో జబర్థస్త్ లాంటి షోలకు యాంకర్ గా చేసిన.. అనసూయ.. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది..

ఎంత బిజీగా ఉన్న కూడా అనసూయ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన యాక్టివిటీస్ ను నెట్టింట్లో అప్ డేట్ చేస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ, తన సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది.. ఎప్పుడు హాట్ అందాలతో ఫోటో షూట్ చేసే ఈ అమ్మడు తాజాగా చీరలో మెరుపులు మెరిపించింది. కళ్లు జిగేలుమనేలా.. గోల్డ్ కలర్ శారీలో అనసూయ అందాలు అద్భుతంగా కనిపించాయి.. ఓనమ్ సందర్భంగా చిరలో కనిపించింది అనసూయ. టాలీవుడ్ లెజండరీ యాంకర్ సుమ ఇంట్లో ఓనమ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో యాంకర్ల కుటుంబం పాల్గొనగా.. అందులో రవి, రష్మి, శిల్ప, లాంటి మరికొందరు ఉన్నారు. అందులో అనసూయ చాలా స్పెషల్ గా కనిపించింది..ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తోంది అనసూయ. పుష్ప2లో ఆమె పాత్రకు మరోసారి ఫిదా అయిపోతరంటూ ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు చేస్తుంది..

Exit mobile version