NTV Telugu Site icon

Anasuya: అనసూయ జిమ్ వర్కవుట్స్ వీడియో చూశారా?.. వామ్మో మాములుగా లేదుగా..

Anasuya (3)

Anasuya (3)

ఒకప్పుడు బుల్లితెరపై బాగా బిజీగా ఉన్న యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. అయితే ఎవ్వరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, తనపై ఎన్ని ట్రోల్స్ నడిచినా అస్సలు లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ వస్తోంది అనసూయ.

తనను ట్రోల్ చేస్తున్న వారికి బోలెడన్ని సార్లు క్లాస్ పీకిన అనసూయ.. ట్రోలర్స్ దిమ్మతిరిగే పోస్టులు పెడుతోంది. తాజాగా దసరా పండగ సందర్భంగా తన జిమ్ వర్కవుట్స్ వీడియో పోస్ట్ చేస్తూ మళ్ళీ ఫైర్ అయ్యింది.. జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోతో పాటు ట్రోలర్స్ కి షాకిస్తూ మహిళలను ప్రోత్సహించేలా ఓ సుదీర్ఘమైన నోట్ రాసింది. ఈ సమాజంలోని దుష్ట శక్తులపై పోరాడుతూ సాధారాణ మహిళ నుంచి కాళిగా మారాల్సిన అవసరం ఉందంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ దసరాను చెడుపై మంచి సాధించిన విజయంలా జరుపుకోండి, సోమరితనాన్ని జయించండి అంటూ ఒక కొటేషన్ ను యాడ్ చేసింది..

స్త్రీ శక్తిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవరు ఏమన్నా నీ శక్తి నమ్ముకో. నీకిప్పుడు అవసరమా ఆంటీ.. 35 దాటినా ఎందుకివన్ని.. ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు కదా.. లాంటి ఎన్నో కామెంట్స్ కనిపిస్తుంటాయి. ఇలా కామెంట్స్ చేసే వీళ్ళంతా ఎదుగుదలను చూసి భయపడేవాళ్ళే అని తన నోట్ లో రాసింది అనసూయ. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.. బుల్లితెరను వీడిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..

Show comments