Site icon NTV Telugu

‘లైగర్’ హీరోయిన్‌ ఇంట విషాదం

బాలీవుడ్ నటి అనన్య పాండే నానమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది. దీంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. నానమ్మను అంటిపెట్టుకుని ఉండే అనన్య ఆమె ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోయింది. సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు కన్నీటి నివాళులు అర్పించింది. 85 ఏళ్ల వయసులోనూ తను ఎంతో యాక్టీవ్ గా ఉండేదని.. ఆమె దగ్గర పెరిగినందుకు గర్వంగా ఉందని తెలుపుతూ.. నానమ్మతో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోలను కూడా షేర్‌ చేసింది. అనన్య పాండే తండ్రి.. నటుడు చంకీ పాండే తన తల్లి స్నేహలత అంత్యక్రియలను నిర్వహించారు. ప్రస్తుతం అనన్య పాండే.. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version