Site icon NTV Telugu

బాలీవుడ్ బ్యూటీ అందాల కనువిందు

Ananya Panday Features With Her Dog in Dabboo Ratnani’s Calendar 2021 Photoshoot

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ పిక్ లో యూత్ కు అందాల కనువిందు చేస్తోంది. డబ్బూ రత్నాని క్యాలెండర్ 2021 కోసం అనన్య పాండే చేసిన ఫోటోషూట్ అద్భుతంగా ఉంది. చిట్టిపొట్టి దుస్తుల్లో హాట్ గా కన్పిస్తున్న ఈ భామ… ఆమె పక్కనే ఉన్న చిన్న కుక్క కూడా ఫొటోకు భలేగా ఫోజిచ్చింది. ఇందులో అనన్య డెనిమ్ షార్ట్, నల్లటి బ్రాలెట్ పై ఎరుపు జాకెట్‌తో గార్జియస్ గా కన్పిస్తోంది. ఇక భారతీయ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తన ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీతో హీరోయిన్లను కెమెరాలో అద్భుతంగా బంధిస్తారు. ఆయనతో ఇప్పటికే సన్నీ లియోన్, విద్యాబాలన్, కియారా అద్వానీ, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి తారలు ఫోటోషూట్లు చేశారు. ఇటీవలే డబ్బూ రత్నాని క్యాలెండర్ 2021 కోసం సన్నీ లియోన్ చేసిన ఫోటోషూట్ లోని లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. కాగా ప్రస్తుతం అనన్య పాండే… విజయ్ దేవరకొండతో కలిసి పాన్-ఇండియా చిత్రం “లైగర్”లో నటిస్తోంది.

Exit mobile version