Anakapalli : అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ‘అనకాపల్లి’ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సినిమా రిలీజ్ దగ్గరపడుతుంటేనే మేకర్స్‌లో ఎక్కడలేని టెన్షన్ మొదలవుతుంది. ప్రేక్షకులకు నచ్చుతుందో లేదోనని భయపడుతూ, థియేటర్లలో బొమ్మ పడే వరకు కంటెంట్‌ను గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టే రోజులివి. కానీ, తమ సినిమా కంటెంట్ మీద ఉన్న పిచ్చి నమ్మకంతో ఓ చిత్రబృందం చేసిన సెన్సేషనల్ సాహసం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే ‘అనకాపల్లి’ చిత్రం. ఏకంగా సినిమా విడుదలకు రెండు నెలల ముందే.. అంటే ఆగస్టు నెలలోనే ‘అనకాపల్లి’ ప్రజలకు ప్రత్యేక ప్రదర్శనలు వేసి, అక్కడికక్కడే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని కాలర్ ఎగరేస్తున్నారు మేకర్స్. ఈ రేంజ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
మాస్ ఎంటర్టైనర్స్తో ప్రేక్షకులను అలరించే టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఏకంగా ఈ సినిమా కోసం నిర్మాతగా, నటుడిగా మారడం విశేషం. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించిన ఈ రా అండ్ రస్టిక్ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. అనకాపల్లిలో వేసిన స్పెషల్ షోలకి పబ్లిక్ నుంచి ఊహించని రేంజ్లో అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. కంటెంట్ లో ఉన్న దమ్ము చూసి టాలీవుడ్ అగ్ర పంపిణీ సంస్థలు ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాయి. ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి’, ‘పూర్వి డిస్ట్రిబ్యూషన్స్’ సంస్థలు కలిసి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నాయి.
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. వినాయక చవితి సందర్భంగా ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్ వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నందిని రాయ్, ఇంద్రజ అబ్సర్, సంగీత క్రిష్, మహబూబ్ బాషా వంటి భారీ తారాగణం ఉంది. ఈ రా అండ్ రస్టిక్ డ్రామాకు త్రినాథరావు నక్కిన అందించిన కథ, స్క్రీన్ ప్లే, ఉదయ్ భాగవతులు పదునైన డైలాగ్స్ ప్రధాన బలంగా నిలవనున్నాయి. కాండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రానికి మాయా.వి సినిమాటోగ్రఫీ అందించగా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో లోకల్ ఆడియన్స్‌ను ఊపేసిన ‘అనకాపల్లి’.. అక్టోబర్ 2న బాక్సాఫీస్ బరిలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?