Site icon NTV Telugu

Mokshagna Debut: ప్రశాంత్ వర్మా.. బచ్చన్ ను దింపుతున్నావా?

Prasanth Varma Mokshagna Movie

Prasanth Varma Mokshagna Movie

Amitabh Bachchan to Be Part of Prashanth Varma- Mokshagna Film: యావత్ నందమూరి అభిమానులు అందరూ ఎంతో ఎదురుచూస్తున్న సమయం దగ్గరికి వచ్చేస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి అన్ని పనులు పూర్తవుతున్నాయి. మోక్షజ్ఞ ఇప్పటికే మూడు పదుల వయసుకు దగ్గర పడుతున్నాడు ఇంకా ఎప్పుడు ఆయనని హీరోగా లాంచ్ చేస్తారు అంటూ అభిమానుల ఎదురుచూపులు ఫలించే విధంగా మోక్షజ్ఞను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ నెలలోనే మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే కథ లాక్ అయింది మూవీ సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యంగా చెబుతున్నారు. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకే ఒక రేంజ్ ప్లానింగ్ అయితే చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Anchor Rashmi: యాంకర్ రష్మీ ఇంట విషాదం!

ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియన్ ఫిలింగా రిలీజ్ చేస్తున్నారు. హనుమాన్ తో ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ మార్కెట్ కూడా మోక్షజ్ఞ మొదటి సినిమాకి వాడుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఏకంగా అమితాబ్ బచ్చన్ ను భాగం చేస్తున్నారని వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథలో ఒక కీలకమైన పాత్రకు అమితాబచ్చన్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని భావించి ప్రశాంత్ వర్మ అండ్ టీం ఆయన సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి గతంలో బాలకృష్ణ హీరోగా కృష్ణవంశీ ప్లాన్ చేసిన రైతు అనే సినిమాలో బాలకృష్ణ అమితాబచ్చన్ కలిసిన నటించాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. మరి ఇప్పుడు మోక్షజ్ఞ కోసం అమితాబచ్చన్ నటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version