NTV Telugu Site icon

Allu Arjun: అమితాబ్ బచ్చన్@ అల్లు అర్జున్ ఫ్యాన్.. మాస్ ఎలివేషన్ మావా ఇది!

Amitabh Bachchan Allu Arjun

Amitabh Bachchan Allu Arjun

పుష్ప సెకండ్ పార్ట్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ మీద ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమాలో ఆయన నటనకు గాను ఇటు విమర్శకుల నుంచి మాత్రమే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ఆయన మీద ఒక రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ మీద అమితా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో పుష్ప సెకండ్ పార్ట్ సినిమాను ప్రమోట్ చేసేందుకు బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్లిన సమయంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసే బాలీవుడ్ యాక్టర్ ఎవరు అని అడిగితే అది అమితాబ్ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయనకు చాలా లాంగ్ కెరియర్ ఉందని ఇండియా మొత్తానికి మెగాస్టార్ అయిన ఆయన సినిమాలు చూస్తూనే మేము పెరిగేమని చెప్పుకొచ్చారు. పెరుగుతున్న సమయంలో ఆయన ఇంపాక్ట్ మా మీద చాలా ఉందని ఆయన అన్నారు.

Pushpa 2: బాక్స్ ఆఫీస్ రప్పా రప్పా అంటే ఇదే.. నాలుగు రోజుల్లో 829!

ఇప్పుడు వయసు పై పడ్డాక కూడా ఆయన చేస్తున్న పాత్రలు ఇంకా ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారని అన్నారు. ఇక ఈ విషయం ఒకరు ట్వీట్ చేయగా అది అమితా దృష్టికి వెళ్ళింది. వెంటనే అల్లు అర్జున్ గురించి ఆయన ట్వీట్ చేశారు మీరు చెప్పిన విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. నాకు కావలసిన దానికంటే ఎక్కువ గౌరవం మీరు ఇచ్చేశారు మేము కూడా మీ వర్క్ కి మీ టాలెంట్ కి పెద్ద ఫ్యాన్ అని పేర్కొన్నారు. మీరు కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు, మీకు నిరంతరం సక్సెస్ దొరకాలని నేను ప్రార్థిస్తున్నానని అలాగే ఇప్పుడు వచ్చిన సక్సెస్ కి మీకు విషెస్ తెలియజేస్తున్నానని అమితాబ్ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది కదరా మాస్ ఎలివేషన్ అంటే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show comments