Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!

Amitabh Bachchan

Amitabh Bachchan

Amitabh Bachchan: బాలీవుడ్‌లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నడుస్తోంది. రీసెంట్‌గా జుహులో హీరో టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన ఫైరింగ్ ఇన్సిడెంట్ తర్వాత ముంబై మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. దీని దెబ్బ ఇప్పుడు ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ దాకా వచ్చేసింది. ప్రతీ ఆదివారం తన బంగ్లా ‘జల్సా’ బయట వేలాది మంది ఫ్యాన్స్‌ను డైరెక్ట్‌గా కలిసి హాయ్ చెప్పే అమితాబ్.. ఈసారి మాత్రం ఒక గ్లాస్ క్యాబిన్ వెనుక నిలబడి ఫ్యాన్స్‌ను కలిశారు.

టైగర్ ష్రాఫ్‌పై జరిగిన ఎటాక్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిశాయి. సెక్యూరిటీ తక్కువగా ఉండే సెలబ్రిటీలను టార్గెట్ చేయాలని ఆ షూటర్స్ గ్యాంగ్‌కు క్లియర్ ఆర్డర్స్ వచ్చాయట. దీంతో ముంబైలోని లోకల్ ఆటో డ్రైవర్లను బుట్టలో వేసుకుని.. ఫోటోలు దిగుతాం అంటూ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ ఇళ్ల దగ్గర ఆటోల్లో తిరుగుతూ రెక్కీ చేసేశారని చెబుతున్నారు. టైగర్ ష్రాఫ్ ప్రతి సండే జుహు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వస్తాడని తెలుసుకునే అక్కడ స్కెచ్ వేశారని అంటున్నారు. సేమ్ గ్యాంగ్ అమితాబ్ బంగ్లా దగ్గర కూడా రెక్కీ చేసిందని తేలడంతో బచ్చన్ ఫ్యామిలీ వెంటనే అప్రమత్తమైంది.

ఓవైపు అమితాబ్ హెల్త్ కూడా బాలేదు. డాక్టర్లు కంప్లీట్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. అయినా సరే ఫ్యాన్స్ కోసం బయటకు రావాలనుకున్నారు బిగ్ బి. కానీ ఈ షూటర్ల గొడవ తెలియడంతో కొడుకు అభిషేక్ బచ్చన్ ఏమాత్రం రిస్క్ తీసుకోదల్చుకోలేదు. స్వయంగా గేట్ దగ్గరే నిలబడి సెక్యూరిటీ అంతా చూసుకున్నారు. అమితాబ్‌ను సేఫ్‌గా ఉంచేందుకు ఒక గ్లాస్ షీల్డ్ ఏర్పాటు చేసి, దాని లోపల నుంచే ఫ్యాన్స్‌కు కనిపించేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ‘కేబీసీ’తో పాటు ‘కల్కి 2’ షూటింగ్‌కు రెడీ అవుతున్న బిగ్ బి ఇలా గ్లాస్ షీల్డ్‌లో అది కూడా చుట్టూ ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య ఫ్యాన్స్‌ని కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.