NTV Telugu Site icon

రెండో డోసు తీసుకున్న అమితాబ్

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఎంతో మంది సినీ తారలు, క్రీడా ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని బిగ్​బీ ఇన్​స్టా ద్వారా తెలిపారు. ‘రెండో డోస్​ కూడా తీసుకున్నాను’ అని రాసుకొచ్చారు. ఇక ఆ మధ్య అమితాబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘మేడే’, ‘గుడ్​బై’ సహా పలు చిత్రాల్లో బిగ్​బీ నటిస్తున్నారు.