Site icon NTV Telugu

Amber Heard : క‌వ‌ల పిల్లల‌కు జ‌న్మనిచ్చిన‌ నటి..

Amber Heard

Amber Heard

తాజాగా హాలీవుడ్ యాక్టర్ అంబర్ హర్డ్ 2025 మదర్స్ డే సందర్భంగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. కుమార్తె అగ్నెస్, కుమారుడు ఓషన్‌లకు జన్మనిచ్చిన‌ట్లు పిల్లల పాదాల‌ ఫోటోను షేర్ చేస్తూ..తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ శుభవార్తను తెలిపింది.

Also Read : kajal : ఆ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్..?

‘2025 మదర్స్ డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎన్నో ఏళ్లుగా నేను నా కుటుంబం కంటున్న కలలు ఈ ఏడాది పూర్తయినందుకు, మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఈ రోజు నేను అధికారికంగా మా ‘హర్డ్ గ్యాంగ్‌’లోకి కవలలను ఆహ్వానిస్తున్నాను. నా కుమార్తె అగ్నెస్ నా కుమారుడు ఓషన్ నా చేతులను నిండుగా ఉంచారు. నాలుగేళ్ల క్రితం నా మొదటి పాప ఊనాగ్‌కు జన్మనిచ్చినప్పుడు, నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఎక్కువ ఆనందంతో పొంగిపోవడం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు నేను మూడు రెట్లు ఎక్కువ ఆనందంతో ఉన్నాను. నా సొంతంగా నా ఇష్టానుసారం, నా సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించి, తల్లి కావడం నా జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవం. ఈ విషయంలో నేను ఈ బాధ్యతను ఆలోచనాత్మకంగా ఎంచుకోగలిగినందుకు ఎప్పటికీ ఆనందంగా ఉంది. ప్రపంచంలోని తల్లులందరికీ, నా కలల కుటుంబంతో కలిసి నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రేమతో మీ అంబ‌ర్’ అంటూ రాసుకోచ్చింది.

 

Exit mobile version