NTV Telugu Site icon

Amaravathiki Aahwanam: భయపెట్టేలా `అమరావతికి ఆహ్వానం’ ఫ‌స్ట్‌లుక్‌

Amaravathiki Ahvanam

Amaravathiki Ahvanam

ప్ర‌స్తుత కాలంలో హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మార్కెట్‌లో గట్టి డిమాండ్ ఉంది. ఇటీవ‌ల బాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన ముంజ్య, స్త్రీ 2 చిత్రాలు దీనికి నిద‌ర్శ‌నం. అలాంటి ఒక ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌, ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో సీట్ ఎడ్జ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం అమరావతికి ఆహ్వానం. అక్క‌డొక‌డుంటాడు ఫేమ్ శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య‌బాల‌కృష్ణ‌, సుప్రిత‌, హ‌రీష్ లు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ఈ సినిమాకు ప్ర‌తిభావంతుడైన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు జివికె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టైటిల్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌ధాన న‌టీన‌టులంతా న‌లుపు రంగు దుస్తుల‌లో సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ముఖాలు పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌క‌పోయినా, వారి క‌ళ్ల‌లో ఒకే త‌ర‌హా తీవ్ర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

Vijay Sethupathi: పూరీతో సేతుపతి.. పాపం తమిళ తంబీలు!!

ఒక మంచి హార‌ర్ థ్రిల్ల‌ర్‌కు కావాల్సిన మూడ్‌ను ఈ పోస్ట‌ర్ పూర్తిగా ప్ర‌తిబింబిస్తోంది. సృజ‌నాత్మ‌క‌త‌తో కూడిన ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో సినిమా ఎలా ఉండ‌బోతుందో ఒక సూచ‌న‌ను మేక‌ర్స్ అందించారు. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో విశేష స్పంద‌న‌ను రాబ‌డుతోంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యాన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జే ప్ర‌భాక‌ర్‌రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, ప‌ద్మ‌నాభ‌న్ బ‌ర‌ద్వాజ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. సాయిబాబు త‌లారి ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తుండ‌గా, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను అంజీ మాస్ట‌ర్ స్వ‌ర‌ప‌రిచారు. త్వ‌ర‌లో ఈ సినిమా నుంచి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్స్‌ను అందించేందుకు చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది.