Site icon NTV Telugu

Amaran : హైదరాబాద్ కు ‘అమరన్’ టీమ్.. ఎందుకంటే.?

Amran

Amran

శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమాను హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేసారు.

Also Read : jr.NTR : బాబోయ్ భార్గవ్ రామ్.. మామూలోడు కాదు..

కాగా టాలీవుడ్ లో రిలీజ్ కు ముందు పెద్దగా అంచనాలు లేని అమరన్ మొదటి ఆట ముగిసిన తర్వాత వచ్చిన సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. దీపావళి కానుకగా రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అమరన్. దీంతో అమరన్ టీమ్ మరోసారి హైదరాబాద్ కు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ దఫా కాస్త గట్టిగా ప్రమోషన్స్ ప్లాన్ చేసింది అమరన్ టీమ్. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో అమరన్ ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ హీరోలైన రజనీ కాంత్,కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తీ, అజిత్ లకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో శివ కార్తికేయన్ చేరాడు. ఈ హీరోగత సినిమాలు డాన్, డాక్టర్ తెలుగులో సూపర్ హిట్ గా నిలిచాయి.

Exit mobile version