NTV Telugu Site icon

ఆ వీడియో పోస్ట్ చేసి రకుల్ పరువు తీసిన తమ్ముడు…!

Aman Preet singh posted pan cake disaster video of Rakul Preeth Singh

ప్రస్తుతం కరోనా కారణంగా సెలెబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని నేర్చుకుంటున్నారు. ఇప్పటికే అందాల చందమామ కాజల్ అగర్వాల్ కుట్లు నేర్చుకోవడం హాబీగా చేసుకున్నా అని తెలిపింది. తాజాగా మరో సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వంటగదిలోని అడుగుపెట్టింది. స్వయంగా తన చేతులతో పాన్ కేక్ చేసి వంటలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అనుకుంది. కానీ అనుకున్నది ఒక్కటీ… అయినది ఒక్కటీ… అన్నట్టుగా ఆమె పాన్ కేక్ చేద్దామనుకుంటే… అది ఇంకేదో అయ్యింది. పాన్ పై కేక్ కోసం పిండి అయితే వేసింది. కానీ అది వేరే ప్లేట్ లోకి తీసేసరికి ఇంకోలా మారింది. ఇదంతా వీడియో తీసిన ఆమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ థ్యాంక్ గాడ్ రకుల్ పాన్ కేక్ వేస్తానని అంటే నేను వద్దన్నాను… తింటాం అని ఉంటే నా పని ఏమయ్యేదో…” అంటూ సరదాగా కామెంట్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే రకుల్ మాత్రం తనను తాను సమర్థించుకుంటూ ఇది డెజర్ట్ గా పనికొస్తుందని ఆ పదార్థాన్ని ఫ్రిడ్జ్ లో దాచేసింది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ తన తమ్ముడిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేద్దామనుకుంది. మేరకు సన్నాహాలు కూడా చేసింది. కానీ అమన్ హీరోగా తెరకెక్కాల్సిన సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయింది.