Site icon NTV Telugu

Amala Paul: బాయ్‌ఫ్రెండ్ లేడు, ప్రెగ్నెంట్ అయ్యా.. జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైందంటూ అమలాపాల్‌ షాకింగ్ కామెంట్స్!

Amala Paul Marriage

Amala Paul Marriage

Atrologer Pediction About Amala Paul Marriage: హీరోయిన్ అమలాపాల్‌ తన వివాహం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఒక జ్యోతిష్యుడు తన పెళ్లి గురించి ముందే చెప్పాడని వెల్లడించారు. ఆ సమయంలో తనకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడని, అలాంటప్పుడు పెళ్లి ఎలా జరుగుతుందో అనుకున్నానని అమలాపాల్‌ తెలిపారు. చివరకు తన పెళ్లి విషయంలో జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైందని, ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

‘ఓ జ్యోతిష్యుడు నా పెళ్లి గురించి ముందే చెప్పాడు. ఆ సమయంలో నాకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడు. అలాంటప్పుడు నా పెళ్లి ఎలా జరుగుతుందో అనుకున్నా. అయితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన కొద్ది రోజులకే గోవాలో జగత్ దేశాయ్‌ను కలిశా. అక్కడి నుంచి మా పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలానికే ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ సమయంలో పెళ్లి గురించి ఆలోచించకపోయినా.. అప్పుడున్న పరిస్థితుల్లో వివాహం తప్పనిసరి అయింది. మా జీవితంలో ఈ పరిణామాలు చాలా త్వరగా జరిగిపోయాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనలు మన గమ్యాన్ని ఎలా మార్చేస్తాయో చెప్పాడని నేనే ఉదాహరణ. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా’ అని అమలాపాల్‌ చెప్పారు.

Also Read: IND vs ZIM: జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌.. గట్టిగా కొడితేనే గట్టెక్కేది, భారత్ తుది జట్టు ఇదే!

అమలాపాల్‌ ఓ సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయారు. ఆ సమయంలో తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. 2017లో విజయ్‌, అమలాలు తమ మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పారు. ఆ సమయంలో అమలా ఎన్నో సమస్యలు, విమర్శలు ఎదుర్కొన్నారు. కెరీర్‌ కూడా అంతంతమాత్రంగానే సాగింది. అలాంటి సమయంలో అమలకు జగత్‌ దేశాయ్‌ పరిచయమ్యాడు. అమలకు అండగా నిలిచాడు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో.. 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2024లో కుమారుడు జన్మించాడు.

Exit mobile version