Allu Arjun : దర్శక రత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ దర్శకులు అందరు కలిసి దర్శక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో దర్శకుల దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, విజయేంద్రప్రసాద్, మురళీమోహన్,హరీష్‌శంకర్, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేష్, వెల్దండి వేణు, చంద్రమహేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మారుతి,శ్యామలాదేవి, నాని, అల్లరి నరేష్, అడవి శేష్, ఆనంద్ దేవరకొండ,వంటి తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ దర్శక రత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా దర్శక దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిసి నాకు ఎంతో సంతోషం కలిగిందని అల్లు అర్జున్ తెలిపారు.
ఈరోజు తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ప్రపంచమంతా ఇప్పుడు తెలుగు సినిమాల వైపు ఎంతో ఆసక్తిగా చూస్తోంది. తెలుగు నటీనటులు మరియు దర్శకులకు ఇప్పుడు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది.తెలుగు దర్శకుల ప్రతిభ కారణంగానే ఇదంతా జరిగింది .దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు చేయాలి అని అల్లు అర్జున్ తెలిపారు.దర్శకులు అందరూ ఎవరి షూటింగ్స్ లో వాళ్ళు ఎంతో బిజీ గా ఉంటారు. అయినా కూడా అందరూ ఒక యూనిటీ గా ముందుకొచ్చి ఇలా దర్శకుల దినోత్సవాన్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు అందరినీ సభా పూర్వకంగా నేను అభినందిస్తున్నానని అల్లు అర్జున్ తెలిపారు.మీలాగే మిగిలిన 24 క్రాఫ్ట్స్ లోని ప్రతీ డిపార్ట్ మెంట్ కూడా ముందుకొచ్చి వాళ్ళను వాళ్ళు సెలెబ్రేట్ చేసుకుంటే మా అందరి సపోర్ట్ వారికీ ఎప్పుడు ఉంటుంది అని అల్లుఅర్జున్ తెలిపారు.ఆ తరువాత జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కు దర్శకుల సంఘం తరఫున ఘనంగా సన్మానం చేశారు.