NTV Telugu Site icon

Allu Sirish: సక్సెస్ పార్టీ చేసుకోవాలని అనుకున్నా కుదరలేదు.. అల్లు శిరీష్ ఆసక్తికర కామెంట్స్

Buddy Movie Allu Sirish Interview

Buddy Movie Allu Sirish Interview

Allu Sirish Interview for Buddy Movie: అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బడ్డీ”లో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించగా శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపారు హీరో అల్లు శిరీష్.

– “బడ్డీ” మూవీని లాస్ట్ ఇయర్ మార్చి లో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్ లోనే రిలీజ్ కు తీసుకురావాలని అనుకున్నా, నా మూవీస్ కు గ్యాప్ వస్తోంది. ఫాస్ట్ గా చేసి డిసెంబర్ 31 సక్సెస్ పార్టీ చేసుకోవాలని నేనూ నిర్మాత జ్ఞానవేల్ గారూ అనుకున్నాం. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్ ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్ గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దీంతో లేట్ అయ్యింది. సమ్మర్ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గకుండా సీజీ వచ్చింది.

– డైరెక్టర్ శామ్ ఆంటోనీ ఈ కథతో నా దగ్గరకు వచ్చి టెడ్డీ బేర్ పాయింట్ తో ఉంటుందని చెప్పారు. టెడ్డీ మూవీ తమిళ్ లో వచ్చింది, అలాగే ఇంగ్లీష్ లో ఇలాంటి సినిమా ఉందని చెప్పాను. మీరు కథ వినండి మీకు కొత్తగా అనిపిస్తుంది, స్టోరీ విన్నాక మళ్లీ ఓటీటీలో టెడ్డీ మూవీ చూడండి అన్నారు శామ్ ఆంటోనీ. అలా కథ విన్నాను. టెడ్డీబేర్ కి ప్రాణం రావడం అనే ఒక్క పాయింట్ ను మాత్రమే దర్శకుడు టెడ్డీ సినిమా నుంచి తీసుకున్నారు. మిగతాదంతా కొత్త కథ. హీరోయిన్ కి విలన్ కు ఉండే కాన్ఫ్లిక్ట్, హీరో క్యారెక్టరైజేషన్, కథకు ఇచ్చిన జస్టిఫికేషన్స్ అన్నీ బాగా స్క్రిప్టింగ్ చేశారు. “బడ్డీ” కథ వింటున్నప్పుడు కొత్తగా అనిపించింది. నేనూ రోజు కథలు వింటా…ఒక వెరైటీ పాయింట్ ఏ కథలో దొరుకుతుందా అని వెతుకుతుంటా. ఆ కొత్తదనం “బడ్డీ” కథలో ఫీల్ అయ్యా. నేను ఫస్ట్ టైమ్ పైలట్ గా కనిపించబోతున్నా. నా క్యారెక్టర్ ఇంటెన్స్ గా ఉంటుంది.

– “బడ్డీ” పోస్టర్ రిలీజ్ నుంచి ఇది రీమేక్ కదా అని కామెంట్స్ వచ్చాయి కాదు స్ట్రైట్ ఫిల్మ్ అని చెప్పడమే మాకు పెద్ద సవాల్ గా మారింది. ఎంత చెప్పినా ఇది రీమేక్ అనే కామెంట్స్ రాసేవారు. అలాంటి వాళ్ళని మనం మార్చలేం, వారికి మొత్తం సినిమా చూపెట్టి ప్రూవ్ చేయలేం కదా. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లకే తెలుస్తుంది “బడ్డీ” స్ట్రైట్ ఫిలిం అని. “బడ్డీ” క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది అని అన్నారు.

Show comments