Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’

Raaka

Raaka

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రంతో ఆయన మార్కెట్ కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, నార్త్ ఇండియాలోనూ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా పుష్ప-2 విడుదల సమయంలో బీహార్‌లో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు.. బీహార్‌లోను దుమ్ముదులిపేసింది పుష్ప2.

దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న రాకా చిత్రానికి అక్కడ భారీ పోటి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాకా’ మూవీపై బాలీవుడ్ ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సిరీస్‌తో వచ్చిన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా హక్కుల కోసం నార్త్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి నుంచే క్యూ కడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, హిందీ బెల్ట్‌లో ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కానీ, బీహార్‌లో మాత్రం ‘రాకా’ చిత్ర హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ల మధ్య గట్టి పోటీ ఏర్పడిందట. అక్కడి ప్రముఖ పంపిణీదారులు ఈ సినిమా హక్కులను దక్కించుకోవడానికి, భారీ ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయమై చిత్ర నిర్మాతలను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో.. పుష్ప తరహాలోనే ఈ సినిమా కూడా నార్త్ ఇండియాలో భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. మరి రాకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.