NTV Telugu Site icon

Allu Arjun : ఇది పుష్ప గాడి రేంజ్.. రికార్డు బుకింగ్స్

Pushpa Tickets

Pushpa Tickets

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప-2’. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ప్రస్తుతం కిస్సిక్ అని వచ్చే ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది.

Also Read : Dulquer Salmaan : ఓవర్సీస్ లో వన్ ‘మిలియన్ భాస్కర్‌’

డిసెంబరు 4 ఓవర్సీస్ లో రిలీజ్ కానున్న పుష్ప ఇప్పటి నుండే అక్కడ తన వేట మొదలు పెట్టింది. ఈ సినిమా కు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇప్పటి వరకు అత్యంత వేగంగా 500 K అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన ఆల్ టైమ్ ఇండియన్ సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక టికెట్స్ బుకింగ్స్ లోను అదరగొట్టాడు పుష్ప రాజ్. ఇప్పటివరకు USA లో కేవలం ప్రీమియర్స్ రూపంలోనే 20,000 పైగా అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ బుక్ రికార్డు సృస్టించిందింది పుష్ప – 2. ఇది ఓవర్సీస్ లోని తెలుగు సినిమాలలో ఒక రికార్డు. ఇప్పుడే ఇలా ఉంటె రిలీజ్ నాటికీ అటు ఇటుగా 4 మిలియన్ కు పైగా అడ్వాన్స్ రూపంలో ఈ సినిమా రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఓవర్సీస్ లోను భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్

Show comments