Allu Arjun : ‘రాకా’కు స్మాల్ బ్రేక్.. లోకి సినిమా కోసం రెడీ అవుతున్న బన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ క్రేజీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా దూసుకెలుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాకా’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హై విజువల్ ఎఫెక్ట్స్, భారీ బడ్జెట్‌తో సరికొత్త సైన్స్ ఫిక్షన్ కథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా సెట్స్‌పై బిజీగా ఉంటూనే బన్నీ తన తదుపరి ల్యాండ్‌మార్క్ చిత్రంపై కూడా గట్టిగా దృష్టి సారించారు.
తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘AA23’. ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారని ఇందుకోసం లుక్ టెస్ట్‌కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్ కనకరాజ్ తన టీమ్‌తో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దడమే కాకుండా ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కథానాయకుడి పాత్ర కోసం లోకేష్ కనకరాజ్ ఇప్పటికే కొన్ని విభిన్నమైన మరియు పవర్ఫుల్ లుక్స్‌ను లాక్ చేశారు. వీటిని ఫైనలైజ్ చేయడానికి జూన్ 25న ముంబైలో అల్లు అర్జున్‌పై ప్రత్యేకంగా లుక్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం బన్నీ ప్రస్తుతం జరుగుతున్న ‘రాకా’ షూటింగ్ షెడ్యూల్ నుండి చిన్న బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. ముంబైలో ఈ లుక్ టెస్ట్ పూర్తయిన వెంటనే ఆయన తిరిగి ‘రాకా’ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ రేంజ్లో రాబోతున్న ఈ సినిమాతో ఐకాన్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!