ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడ్ సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also Read : Ratan Tata : రతన్ టాటా కు టాలీవుడ్ ప్రముఖుల నివాళి
కాగా పుష్ప -2 రిలీజ్ విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లో రెండు డేట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి పుష్ప -2 ను డిసెంబరు 6న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ విషయమై అధికారకంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఒకరోజు ముందు వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. ఇందుక్కారణం లేకపోలేదు. ఓవర్సీస్ లో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ ఉండడంతో డిసెంబరు 5న పుష్ప వస్తే ఫస్ట్ వీక్ లో మెయిన్ థియేటర్స్ అందుబాటులో ఉండవు. అదే ఓవర్సీస్ ప్రీమియర్స్ డిసెంబరు 4న వేస్తే వారం పాటు PLF ప్రదర్శనలను గట్టిగా ప్లాన్ చేయవచ్చు. తెలుగు స్టేట్స్ లో కూడా లాంగ్ రన్ దొరుకుతుంది. ఈ రెండు కాకుండా డిసెంబరు 20న వస్తే తెలుగు స్టేట్స్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వస్తుంది. కానీ ఓవర్సిస్ మార్కెట్ లో తీవ్ర పోటీ ఉంటుంది. ఐమాక్స్ వంటి స్క్రీన్స్ కూడా అందుబాటులో ఉండవు. క్రిస్టమస్ అంటే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో సినిమాలు ఉంటాయి. మరి ఫైనల్ గా ఈ డేట్ కు వస్తారో మరి కొద్దీ రోజులు ఆగితే గని తెలియదు.