‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆ తరువాత ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కించి తన సత్తా చాటాడు. అదే సమయంలో ‘రావణం’ అనే మరో యాక్షన్ మూవీని ప్రభాస్‌తో చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇక ఆ కథ బన్నీ చేతుల్లోకి వెళ్లిందని ప్రచారం మొదలైంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ కూడా సినిమా చేయడం లేదని వేరే దర్శకుడికి అప్పచెబుతున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు..
Also Read : Abhishek Bachchan : ఆమె మాటలే నాకు బలం..
రీసెంట్‌గా నితిన్ కథానాయకుడిగా, దిల్ రాజ్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. ఈ మూవీ జూలై 4 (శుక్రవారం) విడుదల కానున్న సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో ముచ్చటించిన దిల్ రాజు.. ‘ ‘రావణం’ సినిమా పక్కా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్ పార్ట్ 2’ అలాగే ఎన్టీఆర్ గారితో చేసే యాక్షన్ ఎంటర్టైనర్. ఈ రెండు పూర్తయిన వెంటనే, ‘రావణం’ సెట్స్ పైకి వస్తుంది. ఇది పెద్ద బడ్జెట్, భారీ కథా నేపథ్యం కలిగిన సినిమా. అందుకే కొంత టైమ్ పడుతుంది. కానీ ప్రశాంత్ నీల్‌తోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు పోతుంది’ అని చెప్పారు. అయితే దిల్ రాజు ఈ సినిమా ఏ హీరోతో చేస్తున్నాం అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. అయితే దిల్ రాజు కామెంట్స్ తో, రావణం మళ్లీ వార్తల్లోకి ఎంటర్ అయింది. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో అమాంతం పెరిగిపోయింది.
