Site icon NTV Telugu

Shaktimaan : శక్తిమాన్‌లో అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాసిల్ జోసెఫ్

Allu Arjun,director Basil Joseph

Allu Arjun,director Basil Joseph

దక్షిణాది టాలెంటెడ్ దర్శకుల్లో బాసిల్ జోసెఫ్ ఒకరు. ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శక్తిమాన్’ పై పనిచేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా మారనున్నాడని వార్తలు సోషల్ మీడియా, ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్ చేశాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన బాసిల్ జోసెఫ్..

Also Read : Bigg Boss 9 : బిగ్ బాస్ 9 సెటప్ రెడీ..! ఈసారి హౌస్‌లో ఎంటర్ కాబోయే స్టార్‌లు వీళ్లేనా?

‘శక్తిమాన్ సినిమా రణ్‌వీర్ సింగ్‌ తోనే జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు లేవు’ అని స్పష్టంగా తెలిపారు. ఈ వ్యాఖ్యలతో అల్లు అర్జున్ శక్తిమాన్ సినిమాలో నటించట్లేదన్న విషయం పై క్లారిటీ అయితే వచ్చింది. అయితే త్రివిక్రమ్‌తో సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత బన్నీ పిఆర్ టీం బాసిల్ జోసెఫ్‌తో కలసి చేసే సినిమా గురించి సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఈ వార్తలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ తదుపరి సినిమా ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ కాంబినేషన్ కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.

Exit mobile version