NTV Telugu Site icon

Allu Arjun : డేవిడ్ వార్నర్ కు ఐకానిక్ స్టార్ విషెస్‌

Warner

Warner

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కు తెలుగు రాష్టాల్లో భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు.  ఆస్ట్రేలియా ఓపెనర్​గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో  విధ్వంసకరబ్యాటింగ్ వార్నర్ సొంతం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా  బ్యాట్ తో విజృభించడమే వార్నర్ కర్తవ్యం. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను  ఉన్నారు. ఇక  వార్నర్ చేసే రీల్స్  కు మిలియన్ వ్యూస్  వస్తుంటాయి. తెలుగు సినిమాలోని పాటలకు వార్నర్ స్టెప్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియన్ మూవీస్ ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్స్​కు సంబంధించిన రీల్స్​తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు వార్నర్.

Also Read : Shobu Yarlagadda : బహుబలి ఫస్ట్ రోజు ప్లాప్ టాక్ విని చాలా బాధేసింది

కాగా నేడు ఈ స్టార్ బ్యాట్స్ మెన్ పుట్టిన రోజు. ఈ సంధర్భంగా పలువురు స్టార్ క్రికెటర్స్ వార్నర్ కుబర్త్ డే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డేవిడ్ వార్నర్ కు పుట్టిన రోజుశుభాకాంక్షలు మై డియర్ బ్రదర్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో డేవిడ్ వార్నర్ ను ట్యాగ్ చేస్తూ స్టోరీ పెట్టారు. అందుకు బదులుగా థాంక్యూ మై బ్రదర్ అని రిప్లై ఇచ్చారు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది పుష్ప నా లేదా వేరే మారె సినిమా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.