Site icon NTV Telugu

Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

Case Filed On Allu Arjun

Case Filed On Allu Arjun

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల సమయంలో నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతూ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు. వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన తన మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లగా ఆ సమయంలో బన్నీని చూసేందుకు వేలాది మంది అభిమానులు అక్కడకు తరలి వచ్చారు.

Pushpa 2 the Rule: హమ్మయ్య మొదలెట్టేశారు!

రవి ఇంటి ముందు హంగామా చేయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అక్కడి ఆర్వో ఫిర్యాదు మేరకు బన్నీతో పాటు, శిల్పా రవిపై నంద్యాల పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144 అమల్లో ఉండగా… అనుమతులు లేకుండా అల్లు అర్జున్ జన సమీకరణ చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కొద్దిరోజుల క్రితమే ఈరోజులో తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు తాజాగా తుది తీర్పును వెలువరించింది.

Exit mobile version