NTV Telugu Site icon

Allu Arjun : అల్లు అయాన్ ఫేవరెట్‌ హీరో ఎవరో తెలుసా..?

Allu Ayan

Allu Ayan

అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేయగా రెండవ ఎపిసోడ్ కు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ విచ్చేశాడు. దీపావళి కానుకగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది ఆహా. ప్రస్తుతం రికార్డు మిలియన్ వ్యూస్ తో దూసుకువెళుతోంది. ఈ రెండు ఎపిసోడ్స్ తో పాటు మరికొందరు స్టార్స్ ఎపిసోడ్స్ ను కూడా షూట్ చేసారు మేకర్స్.

Also Read : Rakesh Varre : ఆకట్టుకుంటున్న ‘జితేందర్ రెడ్డి’ చిత్ర ట్రైలర్

అందులో భాగంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప – 2 ఎపిసోడ్ కూడా షూట్ ఫినిష్ చేసారు. అయితే ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో పాటు అయన ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అర్హ కూడా  వచ్చారట. హోస్ట్ నందమూరి బాలకృష్ణ పిల్లలిద్దరితో సరదాగా అటపట్టిస్తూ పలు ప్రశ్నలు అడిగారట. అందులో భాగంగానే అల్లు అయాన్ ను నీకు ఇష్టమైన ఎవరు అని అడిగారట బాలయ్య. అందుకు బదులుగా అల్లు అయాన్ తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇస్తామని చెప్పడంతో షోలో ఒక్కసారిగా చప్పట్లు విజిల్స్ తో మోగిందట. ప్రభాస్ చేసే యాక్షన్ చాలా ఇష్టం అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట హల్ చల్ చేస్తోంది. కానీ ఈ ఎపిసోడ్ ఇప్పట్లో స్ట్రీమింగ్ కు రాదని తెలుస్తోంది. పుష్ప -2 రిలీజ్ నాటికీ అనగా డిసెంబరు మొదటి వారం స్ట్రీమింగ్ కు తీసుకురానుంది ఆహా.

Show comments